అతి సౌలభ్యమయిన ధరలకే ఇంటర్నెట్ సౌకర్యం కలుగ చేసిన ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం.ఇంటింటికి మరియు కార్యాలయాలకు ఆతి చౌక ధరకే ఇంటర్నెట్ సౌకర్యం కలుగ చేయ ఉద్దేశ్యం తో ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు గురువారం ఆంధ్రప్రదేశ్ ఫైబరునెట్ ని విశాఖపట్నం లో ప్రారంభించినారు.

  • ఇంటికీ 15Mbps వేగంతో నెలసరి 149 రూపాయల రుసుముతో అందచేస్తూ ఏక కాలంలో కార్యాలయాలకు 100mbps 999 రూపాయల తో ఇంటర్నెట్ సౌకర్యం అందచేయ పడును.
  • ఇతర సర్వీసు ప్రొవైడర్ కంపెనీల రుసుములతో పోల్చిన ఈ రుసుము అతి తక్కువ.
  • జాతీయ ప్రభుత్వ ఆప్టిక్ ఫైబర్ నెట్ వర్క్ పధకంలో భాగంగానే రాష్ట్ర ఫైబర్ గ్రిడ్ సంస్థ 333 కోట్ల మూలధనం తో మార్గదర్శక సంస్థ పని చేయును. తదుపరి ఈ సంస్థ జూలై మాసాంతములోగా ఇతర జిల్లాలో పని ప్రారంభించును.
  • 3 కోట్ల కుటుంబాలకి ఈ సౌకర్యం అందుబాటులోనికి తీసుకొని రావటం ప్రధమ ప్రాముఖ్యముగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించి, దాన్ని దిగ్విజయముగా అమలు పరచుటకు సిస్కో సంస్థ తో భాగస్వామ్య ఒప్పందం చేసుకొనటం అయినది

 


About pratibha mca

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *