రానున్న మూడు సంవత్సరములలో లక్ష యాభైవేల రైతులకు సేంద్రీయ వ్యవసాయం లో శిక్షణ ఇప్పించుటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేసింది. అట్టి శిక్షణ పిదప్ ‘సేంద్రీయ రైతు’ అని ధ్రువ పత్రం ప్రభుత్వం చే అందచేయబడును. ధ్రువ పత్రం పొంది అట్టి పద్దతులలో సేద్యం చేసిన వ్యవసాయదారుడు తన పంటను అధిక ధరలకు అమ్ముకొన వచ్చును. తదనుగునంగా ఇప్పటికే ఐదు వేల పైచిలుకు వ్యవసాయదారులు కాకినాడలో శిక్షణ పొంది ఉండిరి.
రసాయన ఎరువులు మరియు పురుగు మందుల వాడకం అంతం చేసి ఆవు పేడ మరి ఇతర సేంద్రీయ ఎరువుల వాడకం పెంచుట ఈ పధకం ఒక్క ముఖ్యోద్దేశం అయిఉన్నది. వ్యవసాయ ఖర్జులు తగ్గించి రైతులకు వ్యవసాయం లాభసాటి చేయుట మరోక ఉద్దేశ్యం.
స్వయం సహాయక బృందాల వలెనె కౌల రైతులకు ‘రైతు క్లబ్’ అను బృందాలను ఏర్పరిచి వాని ద్వారా ఉమ్మడి పెట్టుబడు పెట్టుట మరియు బ్యాంకుల ద్వారా గ్రూప్ కొల్లెటరాల్ సెక్యూరిటీతో రుణాలు పొందుటకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరచింది.
పంట నాశనం తగ్గించి పర్యావరణం కు అనుకూలమైన పంటలను పెంచుటకు వ్యవసాయ పర్యావరణ పటం తయారుచేసి, ప్రతి పల్లె దాని అనుగుణమైన పంటలను సాగు చేయుటకు మరియు సేజనల్ పంటలను ప్రోత్సహించుటకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయుచున్నది.
మూలం : ఎకనామిక్ టైమ్స్