అంకుర పరిశ్రమలకు ప్రోత్సాహం అందించుటకు NASSCOM తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంనగరాలలో అంకుర పరిశ్రమలు సంచలనం సృష్టిస్తున్నాయి. అత్యాదికముగా ఉపాధి కల్పన చేయగల అంకుర పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన పరిస్థితుల కల్పనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాముఖ్యతను ఇస్తున్నాయి. అంకుర పరిశ్రమల స్థాపనకు కావలసిన సదుపాయాలు సమకుర్చుటకు మార్చి మాసంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  NASSCOM తో అవగాహన ఒప్పంద పత్రాల మీద సంతకం చేసినది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయడు గారి సమక్షంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుఫున ఇన్ఫర్మేషన్టెక్నాలజీ మరియు కమ్యూనికేషన్స్ను మంత్రి శ్రీ P. రఘునాథ రెడ్డి మరియు NASSCOM తరుఫున ఆ సంస్థ అధ్యక్షుడు శ్రీ R. చంద్రశేఖర్ పత్రాల మీద సంతకం చేసారు.

విశాఖపట్నంలో 10000 అంకుర పరిశ్రమల స్థాపనకు అవసరమైన వసతులు సమకూర్చుట, వినూత్న అలోచలనలతో పరిశ్రమ స్తాపన కు ముందుకు వచ్చిన ఔస్తాహిక పారిశ్రామికవేత్తలకు కావలసిన సలహాలు మరియు వెంచర్ కాపిటలిస్ట్లలు, ఇన్వెస్టర్స్ నుండి మూల ధనం సమకూర్చుకోవటం లో సహకారం అందించుటకు NASSCOM అంగీకరించినది.

NASSCOM వేర్ హౌస్ నిర్మించి అంకుర కంపెనీలకు వాని ప్రాధిమిక ప్రారంభ పనులు చేపట్టుటకు 6 మాసాలకు బాడుగకు ఇచ్చట, వాటి ఇన్వెస్టర్ సమావేశాలు నిర్వహణకు తోట్పాటు అందించుట, కమ్యూనిటీ సమావేశాలకు మరియు కాన్ఫరెన్స్లకు   స్థలం రోజు వారి లేక వారం కి అద్దె చెల్లుంచు విధానంలో అద్దె కి ఇచ్చును.

మూలం : ది హిందూ


About pratibha mca

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *