ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన రిటైల్ విధానందేశం లో నూతన రిటైల్ విధానం ప్రప్రధముగా ప్రకటించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రిటైల్ వ్యాపారం సులువుగా నిర్వహించుటకు కార్మిక చట్టాలలో పని గంటలు తదితర నిభందనలలో పెను మార్పులు చేసినది. కార్మిక సమ్మెలను నిరోధించుటకు మరొక్క అడుగు ముందుకు వేసి ఆహార మరియు  కిరానా వ్యాపారములను కూడా అత్యవసర సేవల నిర్వహణ  చట్టం (ESMA)  పరిధిలోనికి తీసుకొని రావటము జరిగినది. అదే కారణంగా పంపిణి మరియు రిటైల్ గిడ్డంగి వ్యవస్థను కూడా ప్రజా సేవల క్రింద శ్రామిక వివాదాల చట్టం 1947 పరిధిలోనికి తీసుకొని రావటం జరిగినది .

రాష్ట్రాన్ని రిటైల్ లాజిస్టిక్స్ కి కేంద్ర  బిందువు గా చేయుట మరియు, నూతన పంపిణి మరియు గిద్దింగుల స్తాపనకు అవకాశములు పెంచుట ఈ విధాన ప్రకటన ముఖ్య  ఉద్దేశ్యం అయిఉన్నది. సామాజిక మరియు ఆర్ధికాభివృద్ధి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష,

విజన్ 2020 సంభందించి 5,000 కోట్లు రిటైల్ రంగంలో పెట్టుబడులు లక్ష్యంగా చేసుకొని ఉన్నది. ఇప్పటికి  జాతీయ రిటైల్ వ్యాపారంలోని  13మిలియన్ రీటైల్ దుకాణాలలో రాష్ట్రం లో 8% దుకాణాలు  ఉన్నవి. అతి పెద్ద రిటైల్ వ్యాపారస్తులైన వాల్మార్ట్, ఫ్యూచర్ గ్రూప్, స్పెనసేర్స్, అరివింద్ లైఫ్ స్టైల్ తదితరులు తో కలసి 1,500కోట్ల రూపాయల  పెట్టుబడులకు అంగీకరించారు. అంతేకాక ఆ రంగం లోని దిగ్గజాలు 25,000 మందికి ఉద్యోగ నియామకాలికి  వాగ్దానం చేసారు.

ఈ విధానం అత్యాద్భుతం గా వర్ణిస్తూ ఈ పధకం నూతన అంకురార్పణ అని రాష్ట్రము లో నాలుగు పట్టణాలను ఎంపిక చేసి వానిలో మాల్స్ ని ప్రారంభించుతామని మరియు 6 నుండి 8 నెలలో వివిధ ప్రాంతాలలో స్టోర్స్ నెలకొల్పుతామని ఫ్యూచర్ గ్రూప్ వెల్లడించింది. రాష్ట్రంలోని వివిద ప్రాంతాల నుండి చిన్న మరియు మధ్యమ వ్యవసదారులు నుండి  వ్యవసాయ దిగుబడులను సేకరించుటయే గాక 15 నూతన స్టోర్స్ స్థాపించుటకు వాల్మార్ట్  భాద్యత తీసుకొన్నది.  ఈ నూతన విధానం రిటైలర్స్ పాక్షిక ఉద్యోగులను తీసుకొనటకు మరియు ముఖ్యమైన సరుకులలో నిల్వలు ఉంచుకొనటకు గల అడ్డంకులను తొలగిస్తుంది. వారంలో ఏడు రోజులూ రోజుకి 15గంటలు వాణిజ్యం చేయుటకు సౌలభ్యం కలదు. పంపిణి కేంద్రములు మరియు గిడ్డంగుల నిర్మాణ నిమిత్తం, వాణిజ్య వర్గం క్రింద, భూమి 33సంవత్సరములకు బాడుగకు ఇవ్వబడును. 100 కోట్ల రూపాయల పెట్టుబడితో 2వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించు పెద్ద వ్యాపార సంస్థలకు ప్రత్యేకముగా రూపొందిచిన ప్రోత్సాహకాలు లభించును.

 

మూలం : ఎకనామిక్ టైమ్స్


About pratibha mca

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *