వృద్ద కళాకారులకు చేయూతకళాకారులకు ఫించను పధకం:

ఈ క్రింది రెండు తరగతులు వారికీ ఈ పధకం వర్తించును.

  1. 1961  పధకం క్రింద లబ్ది పొందుతున్నవారు,
  2. నూతనముగా అర్హత పొందిన రచయితలు, రచయిత్రులు,  కళాకారులూ మొదలగు వారు.

అర్హతలు:

  1. వారి సంబంధిత రంగంలో ఉత్కృష్టమైన సేవలు అందించినవారు  ఈ పధకం క్రింద అర్హులు.   తమ రచనలు ముద్రించబడని సాంప్రదాయ పండితులు కు కూడా ఈ పధకం వర్తించును.
  2. అర్జీదారుల, వారి భార్య లేక భర్త నెలసరి ఆదాయం తో కలిపి , నెలసరి ఆదాయం నాలుగు వేలు మించి ఉండరాదు.
  3. అర్జీదారుని  వయసు 60సంవత్సరములు మించి ఉండవలెను. 40సంవత్సరముల కంటే తక్కువ వయస్సు కలవారు వారి పేరు నమోదు చేసుకున్నచో  వారికీ అటల్ ఫించను పధకం క్రింద 2035వ సంవత్సరము నుండి లబ్ది చేకూరును.
  4. ఈ మధ్య కాలంలో రాష్ట్ర లేక కేంద్ర ప్రభుత్వ పురస్కార గ్రహీతలు వారి నెలసరి ఆదాయం పధకంలోని ఆదాయ పరిమితి ని మించని చో  ఆ రాష్ట్ర ప్రభుత్వ సిఫారసుతో సాంస్క్రుతిక మంత్రిత్వ శాఖలోని ఒక విభాగం తనిఖి చేసి నిపుణుల కమిటీ ఆమోదం పొందవచ్చు.

సహాయ స్వభావం:

నెలసరి భత్యం గా ఫించను లభించును. రాష్ట్ర ప్రభుత్వం 500రూపాయలు మరియు కేంద్ర ప్రభుత్వ సహాయము 3500రూపాయలకు మించకుండా లభించును.

భత్యం రద్దు :

 

  1. లబ్దిదారుని నెలసరి ఆదాయం ఆదాయ పరిమితిని మించిన చో ఈ పధకం క్రింద లభించు భత్యం రద్దు చేయబడును.
  2. మూడు మాసాల ముందు సమాచారం తో ప్రభుత్వం తన విచక్షణా పరిధిలో అట్టి భత్యం రద్దు చేయ అధికారం  కలదు.
  3. లబ్దిదారులు స్వయముగా ఈ పధకము నుండి నిష్క్రమించ సమాచారము పంపి భత్యం రద్దు చేయుంచుకొనవచ్చు. సమాచారం అందిన దినము నుండి భత్యం రద్దు కాబడును.

లబ్దిదారుడికి మరణం సంభవించిన :

లబ్దిదారుని పై ఆధారపడిన కుటుంబ సభ్యల ఆదాయం పరిగణ లోనికి తీసుకొని ప్రభుత్వం తన విచక్షణ తో నెలసరి భత్యం కొనసాగించవచ్చు.

భార్యకు జీవిత కాలము లబ్ది లభించును. ఇతర సభ్యలకు జీవన సముపార్జన లేక వివాహము లేక 21సంవత్సరముల వయసు, వీని లో ఏది ముందుగా సంభవించు నో అట్టి సమయము నుండి భత్యం రద్దు కాబడును.

మరింత సమాచారం కొరకు మరియు సంప్రదించ వివరాలకు :

https://www.indiaculture.nic.in/pension-grant


About pratibha mca

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *