షెడ్యూల్ తెగల విద్యార్ధులకు కేంద్ర ప్రభుత్వపు ప్రీ మెట్రిక్యులేషన్ స్కాలర్‌షిప్‌స్కీం పేరు : 9వ మరియు 10 వ తరగతి షెడ్యూల్ తెగల విద్యార్ధులకు కేంద్ర ప్రభుత్వపు ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ .

లక్ష్యం : 9 మరియు 10 వ తరగతి చదువుతున్న షెడ్యూల్ తెగల  విద్యార్ధుల తల్లి తండ్రులను ఆర్ధికంగా ఆదుకొని వారి పిల్లలు ఎట్టి ఆటంకములు లేక విద్య కొనసాగించటం  ఈ పధకం ఒక్క ముఖ్యోద్దేశ్యం. ఇట్టి ప్రోత్సాహం వలన ఆ విద్యార్ధులు తమ చదువులు కొనసాగించి పోస్ట్ మెట్రిక్యులేషన్ చదువులు కూడా పూర్తి చేయ అవకాశములు పెంపొందును.

అర్హతలు :

  1. విద్యార్థి షెడ్యూల్ తెగలకు చెంది ఉండవలెను.
  2. తల్లితండ్రుల లేక సంరక్షకుని సంవత్సర ఆదాయం Rs. 2లక్షలు మించి ఉండరాదు.
  3. విద్యార్థి ఏదైనను ఇతర పధకంలో ప్రీ మెట్రిక్ కేంద్రీయ స్కాలర్‌షిప్‌ అందుకున్నచో , అట్టి విద్యార్థి ఈ స్కాలర్‌షిప్‌ కు అనర్హులు.
  4. క్రమం తప్పని హాజరుతో పూర్తి స్థాయి విద్యార్థి అయి ఉండి, ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల లో కాని లేక కేంద్ర /రాష్ట్ర బోర్డు అఫ్ ఎడ్యుకేషన్ లో చదువుతూ ఉండవలెను.

స్కాలర్‌షిప్‌ మొత్తం :

అంశం డే స్కాలర్ హస్టలర్
స్కాలర్షిప్ 10 నెలలకు Rs. 150/-  నెలకు Rs. 350/-  నెలకు
పుస్తకాలు మరియు తాత్కాలిక గ్రాంట్ Rs. 750/-  నెలకు Rs. 1,000/-  నెలకు

 

అర్జి పెట్టుటకు: https://www.tribal.nic.in/WriteReadData/userfiles/file/File1438.pdf

పధకం గురించి మరింత సమాచారం కొరకు : https://www.tribal.nic.in/WriteReadData/userfiles/file/File1437.pdf


About pratibha mca

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *