అంగ వైకల్యం గల ఔత్సాహిక వ్యాపారవేత్తల కు చేయూత అందించ విశేష ఉద్యమి మిత్ర పధకం ఉద్దేశించబడినది. ఈ పధకం NHFDC ద్వారా వివిధ రాయితీ పధకములు క్రింద నూతన వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించుటకు కావలసిన చేయూత అందచేయును.
లక్ష్యం:
వివిధ రాయితి పధకములు క్రింద NHFDC ద్వార రుణ సదుపాయం పొందుటకు కావలసిన సమాచారం, పొందుపరచవలసిన పత్రాలు వగైరా విషయాలలో విశేష ఉద్యమి మిత్ర, SCAs/RRB, మొదలగు సంస్థలు మార్గదర్శక పాత్ర వహించుట ఈ పధకం ముఖ్య ఉద్దేశ్యం గా నిర్ణయంపబడినది.
విశేష ఉద్యమి మిత్ర సంస్థగా నమోదుకు కావలిసిన అర్హత ప్రామాణికాలు
- ఇప్పటికే జాతీయ స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తున్న వ్యాపారాభివృద్ధి సంస్థలు అనగా NIESBUD (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎన్త్రేప్రేనేఉర్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్ ) మొదలగు.
- భీమా ప్రతినిధులు, బ్యాంకు మొదలగు ఆర్ధిక సంస్థలకు పనిచేయు ప్రతినిధులు మరియు తపాలా శాఖ ప్రతినిధులు కూడా అర్హులు.
- CMD, NHFDC గుర్తింపు పొందిన శిక్షణ సంస్థలు, NGOs మొదలగు వానికి అర్హత కలదు.
విశేష ఉద్యమి మిత్ర ల కు లభించు ఆర్ధిక సహకారము
ఎన్నిక కాబడిన విశేష ఉద్యమి మిత్ర సంస్థలకు, అర్హులైన అంగ వైకల్య వ్యాపారవేత్తలు కు వారి స్వంత వ్యాపారము ప్రారంభించుటకు కావలసిన చేయూతనిచ్చేందుకు మరియును ఇతరములైన సహాయ సహకారములు అందచేయుటకు , ఈ క్రింద పేర్కొనబడినట్లు ఆర్ధిక సహాయము అందచేయబడును.
లక్ష రూపాయల ఋణం వరకు కేసు కీ 500 రూపాయలు
లక్ష పైబడి 5 లక్షలు వరకు కేసు కీ 750 రూపాయలు
5 లక్షలు పైబడిన కేసు కు 1000 రూపాయులు
మరింత సమాచారమునకు https://www.nhfdc.nic.in/upload/SCHEME%20FOR%20PROVIDING%20HANDHOLDING.pdf
NFHDC సంప్రదించుటకు https://www.nhfdc.nic.in/contact-us