రుణాల ఎగవేతను కఠిన శిక్షార్హమైన నేరం గా పరిగణించటానికి అవుసరమగు నూతన చట్టాలను అందుబాటులోనికి తీసుకొని వచ్చి, ఉద్దేశ్యపూర్వకంగా రుణాలను చేల్లిపు చేయని వారికీ కాల పరిమితి ఇచ్చి , అట్టి కాల పరిమితిలో రుణాలు చెల్లింపు చేయనిచో వారికీ జీవిత కాలంలో మరే ఇతర బ్యాంకు లలో ఋణ సదుపాయం లభించనట్లు ప్రభుత్వం యోచిస్తున్నది,
అంతే కాకుండా ఇతర చర్యలు చేపట్టుటకు ఆలోచన జరుగుతున్నది. బ్యాంకు లలోను మరి ఇతర ఆర్ధిక సంస్థలలోను ఏదైనను కంపెనీ ఋణములు చెల్లింపు చేయనిచో అట్టి కంపనీలో ఋణములు ఇచ్చిన సంస్థలకు/బ్యాంకులకు అధిక వాటా పొందుటకు వీలు కల్పించబడినది. భారతీయరిజర్వు బ్యాంకు నూతన వ్యూహాత్మక ఋణ పునర్నిర్మాణ అదేనుసారం క్రింద బ్యాంక్లు సకాలంలో బాకీ తీర్చని కంపెనీలలో అధిక వాటా పొంది కంపెనీని కైవసం చెసుకొన వీలు కలిపించబడినది. కాని చట్ట పరమైన నిభందనల వలన 30% మించి వాటాను పొందలేవు. అట్టి కంపెనీ అనుబంధ కంపెనీ కానిచో. కానీ ఈ రూల్ వలన బ్యాంకులు తమ రాని బాకీలను పెట్టుబడులుగా మార్చుకొని అట్టి మార్చుకొన్న వాటాలను మరో కంపనీకు అమ్ముకొన వచ్చును.
కొంతమంది బ్యాంకర్లు నేరారోపణలు చేయతగ్గ కారణములు అనగా నిధుల మళ్లింపు, లెక్కలు తారుమారు చేయుట మొదలగునవి,లేకుండానే ఎగవేతదారుల మీద శిక్షార్హ నేరములు మోపవచ్చునా అని సందిగ్ధంలో ఉన్నారు.
భారత రిజర్వు బ్యాంకు నిభందనలు ప్రకారము చెల్లింపు సామర్ధ్యం కలిగి కూడా బకాయిలు సర్దుబాటు చేయని బాకిదారులు, నిధుల మల్లింపుకు పాల్పడిన వారు, తనఖా లో ఉన్న ఆస్తులను బ్యాంకులకు తెలపకుండా అమ్మినవారు, ఉద్దెశ్యపూరక ఎగావేతదారులు క్రింద వర్గీకరించవచ్చు.
గ్యాన్ సంఘం మీటింగ్ లో బ్యాంకు ఋణముల రిస్క్ మరియు ఎటుల నిర్వహించ వలెనో అని చర్చించిరి. వ్యవసాయ భూములను కూడా సెక్యూరిటైజెషన్ అండ్ రికన్స్ట్రక్షన్ అఫ్ ఫైనాన్సియల్ అసెట్స్ అండ్ ఎనఫోర్స్మెంట్ అఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం పరిధిలోనికి తీసుకొని వచ్చిన, అట్టి ఆస్తులు హామీ క్రింద ఉన్న రుణముల రికవరీ సులభమగునని చర్చించిరి అని కొన్ని వర్గముల ద్వారా తెలిసినది.
మూలం : ఎకనామిక్ టైమ్స్