వాడుకలో లేని భవిష్య నిధి ఖాతా లో ఉన్న నిల్వల పై వడ్డీ చెల్లింపు చేయవలెనని ఉద్యోగ భవిష్య నిధి సంస్థ నిర్ణయించటం జరిగినది. ఇట్టి సదుపాయం ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చును.
ఉద్యోగ భవిష్య నిధి ధర్మకర్తల సమావేశం ముగిసిన అనంతరం గౌరవనీయ మంత్రి బందరు దత్తాత్రేయ పత్రికా ప్రతినిధులకు సెలవిచ్చిరి.
ఇది ఉద్యోగులకు అనుకూలమైన చర్య అనియు, ఇందు వలన 9 కోట్ల ఉద్యోగులు లబ్ది పొందుతారని పేర్కొన్నారు.
మూలం : టైమ్స్ ఆఫ్ ఇండియా