కిశోరి శక్తి యోజన – కౌమార దశలోని బాలికలకు సాధికారంపధకం నామధేయం : కిశోరి శక్తి యోజన

లక్ష్యం : కౌమార దశ లోనికి అడుగిడిన బాలికలు తమ జీవన యానం ఒడుదోడుకులు లేక సాఫీగా సాగుటకు వలసిన సాధికారికత పెంపొందించుట.

  1. 11-18సంవత్సరముల నడుమ వయస్సు కల బాలికల పోషణ మరియు ఆరోగ్య స్థితి గతులను మెరుగుపరుచుట,
  2. బాలికలకు సామజిక స్పందన పెంచుకొన తపన వారిలో కలుగు చేసి వారి జీవితం లో స్వంత నిర్ణయ శక్తీ పెంచుకొనటకు కావలసిన విషయ పరిజ్ఞానం మరియూ సంఖ్యానైపుణ్యము పొందుటకు అవకాశములు కల్పించుట.
  3. బాలికలు గృహ ఆధారిత మరియు వృత్తి నైపుణ్యతలు పెంచుకొన కావలసిన శిక్షణ మరియు సంసిద్దత పొందు పరుచుట.
  4. ఆరోగ్యం, పరిశుభ్రత, పోషక విలువలు, కుటుంబ సంక్షేమం, గృహ నిర్వహణ మరియు శిశు సంరక్షణ, మరియు 18సంవత్సరముల పిదప లేక మరింత ఎక్కువ వయస్సు మరియు మానసిక పరిపక్వత వచ్చిన తరువాత వివాహానికి సంసిద్ధిత గురించ అవగాహన కల్పించుట.

లక్ష్యం చేసుకున్న సమూహాలు :  

  1. 11-18 సంవత్సరముల వయస్సు గల బాలికలు అందరూ పధకం క్రింద సహాయము పొందవచ్చును. ఎటువంటి ఆదాయ పరిమితులు లేవు.
  2. 11 నుండి 15సంవత్సరముల పేద బాలికలకు ప్రాధాన్యత ఇవ్వబడును.
  3. అంగన్వాడి ల నుండి 11 నుండి 18సంవత్సరముల వయస్సు కల అర్హత కల ఆడ పిల్లల నుండి 20మంది ఆడ పిల్లలను  ప్రత్యేకముగా ఎన్నిక చేయబడును.
  4. ఆ 20మంది బాలికలు బాలికావాడికి పంపబడును. ఐ. సి, డి.ఎస్, ప్రాజెక్ట్ క్రింద మొత్తం అంగన్వాడిలలో 10% మాత్రమే రొటేషన్ పద్దతిలో ఎంపిక చేయబడును.

ఆచరణ ప్రణాళిక :

 ప్రభుత్వ సూచనలను అనుసరించి ప్రతి సంవత్సరము ఆచరణ ప్రణాళిక తయారు చేయవలెను.

క్రియాశీల నమోదు కాలం :

సాదారణ విద్య కాకుండా అక్షరాస్యిత నైపుణ్యాలు మరియు గృహావసర నైపుణ్యత లు కౌమార దశ లోని బాలికలకు అందించు అవ్యసకత.

క్రియాశీల నమోదు కాలం ఒక యవ్వనవతి కి మరోక యవ్వనవతి కి మారును. నమోదు యవ్వనవతి యొక్క గ్రహానా శక్తీ, విద్యార్హతలు, గృహోపకర నైపుణ్యత మొదలగు వాని మీద ఆధారపడి ఉండును.

నిధులు :

పధకం అమలకు నిధులు కేంద్ర ప్రభుత్వం సమకుర్చును కాని అనుబంధ పోషకాహార ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వం భరించ వలెను.

ప్రతి ఐ. సి. డి. ఎస్. ప్రాజెక్ట్ కి సాలుకి కేడర ప్రభుత్వ సహకారము Rs. 1.10లక్షలకు పరిమితి విధించుట జరిగినది

మరింత సమాచారము కొరకు : https://wcd.nic.in/schemes/kishori-shakti-yojana


About pratibha mca

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *