అంతర్జాతీయ విపణి ని చేరుటకు చొరవపధకం:

మార్కెట్ ఆక్సెస్ ఇనిషియేటివ్(MAI)

పధకం లక్ష్యములు:

@ ఈ పధకం మన దేశపు ఎగుమతులను స్థిరమైన పద్ధతి లో వృద్ధి చెందుటకు ఉత్ప్రేరకంగా సహాయము పడుటకు యోచించినవారు.

@ వివిధ దేశముల కు చెందిన విపణిల లోని గిరాకీని అధ్యాయణం మరియు సర్వే ల ద్వారా అంచనాలు కట్టి ఆ గిరాకీ ఆధారముగా ఆ దేశములకు అట్టి ఉత్పత్తులనే సరఫరా చేయుటకు  ఊహా రచన చేయుట

@  నూతన అంతర్జాతీయ విపణిలను  లేక ఉన్న అంతర్జాతీయ ఎగుమతులను వ్రుద్ది పరుచుకొనుటకు  కృషి చేయుటకు ఎగుమతుల ప్రోత్సాహక సంస్థలు , వ్యాపార ప్రోత్సాహక సంస్థలు, జాతీయ స్థాయి సంస్థలు, పరిశోధన సంస్థలు, విశ్వవిద్యాలయంలు, ప్రయోగశాలలు మొదలగు వానికి  సహకారము అందించుట.

ఈ పధకము ద్వారా లభించు సహాయ సహకారములు:

విదేశములో క్రయ విక్రయ ప్రాజెక్ట్ ల నిర్వహిస్తున్న సంస్థలకు ఆర్ధిక సహకారము

ఎగుమతిదారులకు, ఎగుమతి ప్రోత్సాహక సంస్థలకు మొదలగు వానికి ఉత్పాదక శక్తిని పెంచుకొనటకు సహకారము,

కొనుగోలుదారుని దేశపు చట్టబద్దమైన నిబంధనములు  అనసరించి చెల్లించిన ఫీజులు మరియు అట్టి ఇతరములైన ఖర్చులను పరిహారం పద్దతిలో చెల్లించుట,

ఈ పధకం క్రింద 2016-17 ఆర్దిక సంవత్సరములో వివిధములైన ఎగుమతి ప్రోత్సాహక సంస్థలకు అనేక విదేశి వస్త్ర ప్రదర్శనలు మరియు ఉత్సవాలు లో పాల్గునుటకు  వస్త్ర విభాగమునకు చెందిన 36.60 కోట్ల రూపాయల విలువ గల 32 ప్రతిపాదనల కు   వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ లోనే వాణిజ్య విభాగము ఆమోదం తెలిపినది.


About pratibha mca

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *