ఎనిమిది రాష్ట్రాలలోని 21మన్దీలను ఒకటిగా చేర్చుతున్న మోడీ ప్రభుత్వం శ్రీ అంబేద్కర్125వ జన్మ దినమైన ఏప్రిల్ 14, 2016, న ఎనిమిది రాష్ట్రాలలోని 21మండిలు లేక టోకు విపణి లను నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్(ఎన్ ఎ ఎం) పదకములో భాగంగా ఏక e-వేదిక కు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ లాంచనముగా అనుసంధానము చేయుచున్నారు అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ  రాధ మోహన్ సింగ్ బుధవారమున సెలవిచ్చిరి. ఈ పదకములో మొత్తం 585 నియంత్రించబడ్డ టోకు విపణులు కాని వ్యవసయోత్పతి విపణి కమిటీలను ఏక త్రాటి మీదికి తీసుకు రావలేనని ముఖ్య ఉద్దేశ్యము అయినది.

ఈ పధకం వలన రైతులకు గిట్టుబాటు ధర మరియు వినియోగదారులకు సరసమైన, నిలకడ ధరలకు సరకులు నిరంతరముగా లభ్యమగును. ఈ e-ప్లాట్ఫారం కు ఇతర విపణులు మరియు కమిటీ లను అనుసంధానము చేయుట వలన వ్యవసాయ ఉత్పత్తులకు జాతీయ ఏకీకృత విపణి అందుబాటులోనికి వచ్చును. ఎన్ ఎ ఎం వలన సరుకుల అమ్మకాలు మరియు వాటి ధరల విషయములో పారదర్సికత కలుగును.

ప్రస్తుతం 7వేల విపణులు దేశంలో విస్తరించి ఉన్నవి. పైలట్ ప్రాజెక్ట్ కి ఎన్నిక కాబడిన రాష్ట్రాలలో గుజరాత్, తెలంగాణ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, హర్యానా మరియు హిమాచల్ప్రదేశ్ ఉన్నవి.

మినప, ఆముదవిత్తనములు, ధాన్యం, గోధుమ, మొక్కజొన్న, పసుపు, ఉల్లి, ఆవాలు, ఇప్పపువ్వు, చింతపండు మరియు బఠానీ పప్పుమొదలగు 12 ఉత్పత్తులు  ప్రపదముగా e-ప్లాట్ఫారం లో వాణిజ్య లావాదేవీలు జరపబడును.

భౌతిక విపణిలో వాణిజ్యం కొనసాగుతున్నప్పటికీ, e-వాణిజ్యంలోవ్యవహార ఖర్చులు తక్కువగా ఉండి, ఏక వాణిజ్య అనుమతి పత్రంతో వాణిజ్యం నిర్వహించుకోనవచ్చును. నాణ్యతా పరిక్షలకు అవకాసము మరియు సింగిలె పాయింట్ లెవీ ఉండును అని ప్రభుత్వోద్యోగుల చెప్పిరి.

క్రిందటి ఏడాదికంటే ఈ ఏడాది వ్యవసాయ దిగుబడి అధికముగా ఉండునని మంత్రి చెప్పారు. అధికోత్పత్తులు కరువుని నియంత్రించి, సరుకులు నిరంతర లభ్యతను నిర్ధారించుటయే గాక రైతుకు గిట్టుబాటు ధర లభించును.       

 

ఎకనామిక్ టైమ్స్ సౌజన్యంతో


About pratibha mca

Check Also

Solar Pump Set Scheme For Agriculture

In order to promote the use of non conventional energy in the agriculture sector, the ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *