నారి శక్తీ పురస్కార – ప్రముఖ సేవలు అందించిన మహిళలను గుర్తించి అవార్డ్స్ తో సత్కరించుటపధకం పేరు :  నారీ శక్తి పురస్కార్

లక్ష్యం : మహిళల అభ్యున్నతి కి ప్రత్యేఖముగా బలహీన మరియు అట్టడుగు వర్గాలకు చెందిన వారికీ విశిష్టమైన  సేవలు అందించి, సమాజము మీద సానుకూల ప్రభావము చూపిన   ప్రముఖులైన మహిళలుకు మరియు సంస్థలకు  పురస్కారము ప్రధానము చేయబడును.

వివరణ :

ప్రతి ఏడాది 20 నారీ శక్తీ పురస్కార్లు ప్రధానము చేయబడును.

ప్రతి ఏడాది ఫెబ్రవరి 20వ తారీఖున ఎంపిక కాబడిన గ్రహీతలను ప్రకటించి, మహిళా దినోత్సవమైన  మార్చ్ 8వ తారీఖున ప్రధానము చేయబడును.

వరస సంఖ్య వర్గం వివరణ అవార్డు వివరములు
సంస్థాగతమైన
1-4 రాణి రుద్రమదేవి అవార్డు – రెండు జిల్లా పంచాయతీలు మరియు రెండు గ్రామ పంచాయితీలు మహిళా సంక్షేమ కార్యక్రమములను అమల పరుచుటలో స్వయంగా కాని ప్రభుత్వ ఫ్లాగ్షిప్ కార్యక్రముల ద్వారా కాని , ప్రత్యేకముగా బేటి బచావో బేటి పధావో లాంటి పధకాల అమల్లో అసాధారణమైన పనితీరు కనబరిచిన జిల్లా మరియు గ్రామ పంచాయతీలు. (1) ప్రశంసా ధృవపత్రం;

(2) ఒక్కక్కరికి రెండు లక్షల రూపాయల నగదు బహుమతి

5-6 మహిళలకు సౌకర్యములు మరియు సేవ అందించుటలో ఉత్తమమైన పట్టణ స్థానిక సంస్థ కు మాతా జిజయాభాయి మహిళా సంక్షేమ కార్యక్రమములను అమల పరుచుటలో స్వయంగా కాని ప్రభుత్వ ఫ్లాగ్షిప్ కార్యక్రముల ద్వారా కాని ,  పధకాల అమల్లో అసాధారణమైన పనితీరు కనబరిచిన నగర సంస్థలు కాని పట్టణ కార్పొరేషన్. (1) ప్రశంసా ధృవపత్రం;

(2) ఒక్కక్కరికి రెండు లక్షల రూపాయల నగదు బహుమతి

7  బాల్య లైంగిక నిష్పత్తి చెప్పుకోతగ్గ రీతిలో మెరుగుపరచిన ఉత్తమ రాష్ట్రానికి కన్నగి దేవి అవార్డు)  బాల్య లైంగిక నిష్పత్తి చెప్పుకోతగ్గ రీతిలో మెరుగు పడుటకుప్రభావం చూపిన రాష్ట్రం లేక కేంద్ర పాలిత ప్రాంతం. (1) ప్రశంసా ధృవపత్రం;

(2)  రెండు లక్షల రూపాయల నగదు బహుమతి

8-9 మహిళా సంక్షేమ మరియు శ్రేయస్సు కు పాటుబడిన ఉత్తమ సివిల్ సొసైటీ అర్గనేజేషణ్(CSO) కు రాణి గైడిన్ల్యుజెలియన్ అవార్డు  మహిళా సాధికారత సాధనకు కావసిన న్యాయ, ఆరోగ్య, విద్య మొదలగు వానిలో అవగాహన కల్పించుటకు చెప్పుకోతగ్గ కృషి సలిపిన  CSO (1) ప్రశంసా ధృవపత్రం;

(2)  రెండు లక్షల రూపాయల నగదు బహుమతి

10 మహిళా సంక్షేమ మరియు శ్రేయస్సు కు పాటుబడిన ప్రైవేటు రంగానికి కాని ప్రభుత్వ రంగానికి కాని చెందిన అత్యుత్తమ సంస్థ కు దేవి ఆహిల్య హోల్కర్ అవార్డు ఉద్యోగావకాశాలు, మంచి ఆరోగ్యం మరియు విద్య అవకాశాలు కలిపించి మహిళా రక్షణ కు కృషి చేసిన  కార్పొరేట్ రంగానికి కాని ప్రభుత్వ రంగానికి కాని చెందిన సంస్థ (1) ప్రశంసా ధృవపత్రం;

(2)  రెండు లక్షల రూపాయల నగదు బహుమతి

మహిళా సాధికారత రంగంలో యెనలేని పరిశోధన మరియు అభివృద్ధి సాధిచిన ఉత్తమ ఇన్స్టిట్యూషన్ కు రాణి లక్ష్మి భాయి అవార్డుRani మహిళా సంభందిత విషయాలలో పరిశోధన మరియు సాంకేతిక అభివృద్దిలో మహిళలకు తగు స్థానం కలిపించి, మహిళలకు చెందిన విషయాలలో విజ్ఞాన వ్యాప్తికి దోహద పడిన ఇన్స్టిట్యూషన్ (1) ప్రశంసా ధృవపత్రం;

(2)  రెండు లక్షల రూపాయల నగదు బహుమతి

వ్యక్తిగత వర్గం
12-13 ధైర్య సహసముల ప్రదర్శన అవార్డు  ఉదహరించబడ తగ వైవిధ్యమయిన తెగువ మరియు ధైర్యంచూపించిన మహిళకు అవార్డు (1) ప్రశంసా ధృవపత్రం;

(2)  ఒక  లక్ష రూపాయల నగదు బహుమతి

14- 20 మహిళా సాధికారతకు మరియు మహిళా సంక్షేమానికి అత్యుత్తమ సేవలు అందించిన 7గురు మహిళలకు అవార్డ్లు మహిళా ఆర్ధిక సామజిక సాధికారతకు, స్త్రీ సంభందమైన చట్టాల అమలకు, పర్యావరణం, రక్షణ, కళ, క్రీడలు, విజ్ఞాన మరియు సాంకేతిక రంగాలలో మహిళల హక్కుల పరిరక్షణకు పాటుబడిన మహిళలకు (1) ప్రశంసా ధృవపత్రం;

(2)  లక్ష రూపాయల నగదు బహుమతి

 

నామినేట్ చేయుటకు అర్హతలు :

జాతి, కుల, వర్గ భేదం లేదు. ప్రతి వ్యక్తి, అర్గనేజేషణ్, ప్రైవేటు, లేక ప్రభుత్వ రంగ సంస్థలు మొదలగున్నవి/

ప్రతి రంగానికి చెందిన అర్హతలకు :

 https://theindianiris.com/wp-content/uploads/2016/04/Eligibility-criteria.docx

నామినేషన్ దరఖాస్తు కొరకు :

https://wcd.nic.in/sites/default/files/Paraforwebsite_0.pdf


About pratibha mca

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *