చల్లబడ్డ నేల తల్లి నిన్ను చల్లగా చూడువాన చుక్క ప్రకృతి మాత వర ప్రసాదం

ప్రతి చుక్కని ఒడిసిపట్టు

నేల తల్లిని చల్లబరుచు

చల్లబడ్డ నేల తల్లి నిన్ను చల్లగా చూడు.

నీరు పంచ భూతాల్లో ఒకటి. భూమి మీద నీరు లేని నాడు మానవ మనుగడే ప్రశ్నార్ధకం.  వాన నీటి ని వృధాగా మురుగు కాలువలు, వాగులు మరియు నదుల ద్వారా సముద్రం పాలు కాకుండా, వానిని నేర్పుగా ఒడిసిబట్టి భూమి అంతరాలలో నీటి నిల్వలను మెరుగు పరచుకొనుటకు హైదరాబాద్ మెట్రోపాలిటన్  వాటర్ సప్లై అండ్ సెవేరేజే బోర్డు ఒక బృహత్ ప్రణాళిక సిద్ధ పరిచి నగర వాసుల సంపూర్ణ సహకారము అభ్యర్దిస్తున్నది . గృహ సముదాయ సంక్షేమ సంఘాల ను సమావేశ పరిచి వాన నీటిని సేకరించి భూమి లో నిల్వ చేయు విధానము గురించి వారికీ అవగాహన కల్పించుట మరియు వారికీ కావలసిన సాంకేతిక  సహకారములు అందించుటకు ముందుకు వచ్చినది.  కాలనీలలో బహిరంగ ప్రదేశాలలో మరియు ఉద్యాన వనాలలో బావుల త్రవక్కం మరియు వాటి నిర్వహణ భాద్యత  తీసుకొనుటకు ఒక అంగీకార ఒప్పందం చేసుకొన సంసిద్దత వ్యక్తీకరించినది. బోర్డు యొక్క అసిస్టెంట్ డైరెక్టర్ కాలనీలలో అవగాహన సదస్సులు నిర్వహించి నీటి నిల్వల కు కట్టడముల ఏర్పాటుకు కృషి చేయును. కాలనీ సంక్షేమ సంఘాలు నిర్దేశించబడిన దరఖాస్తు లో వివరములు పొందుపరిచిన బోర్డు యొక్క శిక్షణ పొందిన సాంకేతిక బృందం ఆ ప్రదేశం పరీక్షించి తగు నీటి గుంతలు మరియు ఇతర కట్టడములు నిర్మించుటలో సహకరించెదరు.

మరింత సమాచారం కొరకు : https://hyderabadwater.gov.in/en/rainwater1/Home.aspx


About pratibha mca

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *