దేశం లో శిశు మరియు స్త్రీల ఆరోగ్య స్థితిలు సమర్దవంతముగా మెరుగు పరచుటకు, అమలుకాని కుటుంబ సంక్షేమ పధకాలు, ప్రత్యేకించి పేద మరియు శ్రద్ద వహించని శిశు మరియు ప్రసూతి మరణాలు మరియు రోగ ప్రభలత, నెరవేర్చుటకు భారత్ ప్రభుత్వం 1997 – 98 లో ఈ కార్యక్రమం ఆరంభించుట జరిగినది.
లక్ష్యాలు : పైన నిర్దేశించిన లక్ష్యాలు చేరుకొనటకు ఈ క్రింద పేర్కొనబడిన అంశాలను డిపార్టుమెంటు అఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆచరించ వలసి ఉన్నది
- శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో సంభవించు మరణాల నియంత్రణ,
- అతిసార వ్యాధుల వలన సంభవించు మరణాల నియంత్రణ,
- క్రొత్తగా పుట్టిన శిశు సంరక్షణ కు అవసరమైన నిభందనలు తప్పని సరిగా అమలు పరుచుట
- 6నెలలు నుండి 3సంవత్సరముల లోపు పిల్లకు విటమిన్ A అనుబంధముగా ఇవ్వటము,
- 5సంవత్సరముల లోపు వయస్సు గల పిల్లలకు ఐరన్ ఫోలిక్ ఆసిడ్ అనుబంధముగా ఇవ్వటము,
- 6నెలల వరకు పిల్లలకు తల్లి పాలు త్రాగించుట, ఏదైనను ఇబ్బంది కలిగినచో ప్రత్యమ్నాయ పోషణ ఆచరణ చేయుంచుట.
దృష్టి నిలపవలసిన కార్యక్రమాలు:
తల్లి పాలు త్రాగించుట
ఐరన్ అండ్ ఫోలిక్ ఆసిడ్ అనుబంధముగా ఇచ్చుట
విటమిన్ A అనుబంధముగా ఇచ్చుట
లబ్దిదారులు :
పిల్లలు మరియు మహిళలు