ప్రముఖుల స్మారక చిహ్నముల నిర్వహణ మరియు అభివృద్ధి కి స్వచ్చంద సంస్థలు/సొసైటీలు/ట్రస్ట్‌లకు గ్రాంట్-ఇన్-ఎయిడ్ సహాయ పధకంమన దేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ పాత్ర వహించిన విశిష్ట వ్యక్తుల గౌరవార్ధం స్థాపించిన వారి స్మారక చిహ్నముల నిర్వహణకు మరియు అభివృద్దికి ఆర్ధిక సహాయము అందించుటకు ఈ పధకం ఆవిష్కరించబడినది.

పరిధి :

  1. ఈ క్రింద ఉదహరించిన మూడు వర్గాలకు ఈ పధకము వర్తించును
  1. ప్రభుత్వ చొరవతో స్థాపించిన స్మారకములు

B రాష్ట్ర ప్రభుత్వ లేక పౌర సమాజాల చొరవతో స్థాపించిన స్మారకములు

C స్వచ్చంద సంస్థలచే స్థాపించబడి ట్రస్ట్‌ల నిర్వహణలో ఉన్న స్మారకములు

  1.  A వర్గమునకు చెందిన వాటి విషయములో భారత ప్రభుత్వపు సాంస్క్రుతిక మంత్రిత్వశాఖ నిర్ణయముతో ఆ శాఖ బడ్జెట్ నిధుల నుండి ఆర్ధిక సహాయము లభించును.
  2. రాష్ట్ర ప్రభుత్వాలు వారు స్థాపించిన స్మారకముల కు నిధులకు ప్రార్ధించిన,  అట్టి స్మారకముల ప్రత్యేక విలువల ఆధారముగా సహాయము మంజూరు చేయబడును.
  3. మతపరమయిన  సంస్థలకు ఈ పధకం వర్తించదు
  4. స్వచ్చంద సంస్థల/పౌర సమాజాల/ట్రస్ట్‌ల ఆధ్వర్యములో ఉన్న స్మారకాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వ సహాయమునకు అనుబంధముగా కేంద్ర సహాయము లభించును.
  5. స్వయం నిర్వాహక సంస్థలకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడును.
  6. పురావస్తు పరిశోధన సంస్థ నిర్వహించు కట్టడాలు మరియు స్మారకములు ఈ పధకము క్రింద సహాయమునకు అర్హత లేదు.

సహయ మొత్తం :

గరిష్టముగా ప్రతి స్మారక నిర్వహణకు పది లక్షలు లభించును కాని నిపుణల కమిటీ సిఫార్సుల ఆధారముగా కొన్ని ప్రత్యేక స్మారకములకు యిరువది లక్షల వరకు సహాయము లభించును.  నిపుణల కమిటీ తగు కారణములను తమ సిఫార్సులలో పొందుపరచవలసి ఉన్నది.

అర్హతలు :

నిర్వహించు సంస్థలు సొసైటీ ల చట్టం ప్రకారము నమోదిత సంస్థ గా ఉండవలెను. కనీసము ఐదు సంవత్సరముల నుండి స్మారక నిర్వహణలో ఉండవలెను. కొన్ని ప్రత్యేక స్మారకముల నిర్వహణ లో కొంత వెసులుబాటు కు కేంద్ర మంత్రిత్వశాఖ ఆమోదం పొందవచ్చును. జాతీయ స్థాయి సంస్థలై ఉండవలెను. నూతన స్మారక భవన నిర్మాణములకు ఈ గ్రాంట్ క్రింద సహాయము లభించదు.

 

మరింత సమాచారము కొరకు: https://www.indiaculture.nic.in/national-memorial


About pratibha mca

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *