నిపు‍ణత పెంపుకు ఋణ సౌకర్యంఅన్ని రంగాలలో అధిక నైపుణ్యం సాధించుటకు జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగా నైపుణ్య వృద్ధి శిక్షణ సంస్థల నుండి సర్టిఫికేట్/డిప్లొమా/డిగ్రీ కోర్స్ పూర్తి చేయుటకు ఋణ పధకం రూపొందించ పడినది. అట్టి కోర్స్ జాతీయ వృత్తి ప్రమాణాలు మరియు అర్హత( నేషనల్ ఆకుపేషణ్ స్టాండర్డ్స్ అండ్ క్వాలిఫికేషన్) సమూహములో పొందుపరచవలసి ఉండవలెను.  శిక్షణా సంస్థలు కూడా జాతీయ నైపుణ్య అర్హత ఫ్రేంవర్క్స్ ను అనుసరించ ఉండవలెను.

లక్ష్యం : ఈ పధకం నైపున్యాభివ్రుద్ది పొందుటకు అవసరమైన కోర్స్ లో శిక్షణకు ఋణ సౌకర్యం (నిబంధనలను అనుసరించ) కలిగింప చేయుట

అర్హత ప్రమాణాలు ; శ్రామిక శిక్షణా సంస్థ నుండి కాని, పాలిటెక్నిక్, రాష్ట్ర విద్య బోర్డు గుర్తిపు పొందిన బడి కాని, ఏదైనా విశ్వవిద్యాలయానికి అనుబంధమైన కళాశాల, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో శిక్షణా భాగస్వామ్యం కలిగిన సంస్థ నుండి కాని  ప్రవేశం పొందిన వ్యక్తులకు ఈ పధకము క్రింద ఋణం పొందు అర్హత కలదు.

శిక్షణా కోర్స్ : ఎట్టి కనీస అర్హత నిబంధన  లేదు కాని అట్టి కోర్స్ పైన చెప్పిన సంస్థల నుండి కోర్స్ జాతీయ వృత్తి ప్రమాణాలు మరియు అర్హత( నేషనల్ ఆకుపేషణ్ స్టాండర్డ్స్ అండ్ క్వాలిఫికేషన్) సంస్థ నిర్దేశించిన కోర్స్ కు మాత్రమే నైపుణ్య ఋణం పొందుటకు అవకాసము కలదు.

ఋణ మొత్తం : ఐదు వేల నుండి లక్షా యాభైవేలు మధ్య ఉండును.

మరింత సమాచారం కొరకు: https://dget.nic.in/upload/uploadfiles/files/SkillLoanschemes.pdf


About pratibha mca

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *