గ్రామీణ యువతా! శిక్షణ అందుకో – నైపుణ్యత పెంచుకోపరిచయం :

గ్రామీణ ప్రాంతాలలో ఉద్యోగ అవకాశములు పెంపొందించుటకు సంకల్పించిన జాతీయ విధానమైన  నైపుణ్యత వృద్ధి మరియు వ్య్వవస్తాపికత -2015 అను విధానమును  అనుసరించి, గ్రామీణ యువతకు వ్యవసాయ ఆధారిత వృత్తులలో నైపుణ్యత పెంచుటకు శిక్షణ  ఇచ్చుట ముఖ్య ఉద్దేస్యముగా ‘స్కిల్ ట్రైనింగ్ అఫ్ రూరల్ యూత్ (ఎస్. టి. అర్. వై)’ అను కార్యక్రమమును ఆరంభించిరి.

లక్ష్యములు :

స్థానిక అవసరాలకనుగుణంగా రైతులు మరియు వ్యవసాయ మహిళలలు అయిన యువతకు అనుకూలమైన నైపుణ్య శిక్షణకు అవకాశం అందించుట,

వ్యవసాయ మరియు వ్యవసాయేతర కార్యక్రమములు నిర్వహించ నిపుణ కార్మికుల సముదాయము ఏర్పరుచుట.

అర్హతలు :

కనిష్టం 5వ తరగతి చదివి 18సంవత్సరముల వయస్సు దాటిన గ్రామీణ యువత కు అర్హత కలదు.

కాని కనిష్ట విద్య అర్హత  ముఖ్య నిభందన కాదు.

జిల్లా/ ఒక శిక్షణ శిబిరానికి  వ్యయ నిభందనలు

ఒక శిక్షణ కు కాల పరిమితి ట్రైనీ ల కనిష్ట సంఖ్య ట్రైనీ కి ఒక రోజు కు ఖర్చు 15 ట్రైనీలకు ఓక  ప్రోగ్రాంకు. సంవత్సరానికి జిల్లా కి 4 ప్రోగ్రాంలకు మొత్తం ఖర్చు
6+1 (including 1 day travel plan) 15 400 15 x 4000 x 7 = 42,000 42,000 x 4 = 1,68,000

 

నోట్ :

ఒక ట్రైనీ కి ఓకే రోజు ఖర్చు Rs.400/- లలో ఈ క్రిందవి జత కలిపి

బస్సు కాని ట్రైన్ లో 2వ స్లీపర్ తరగతి,

శిక్షణ సమయం లో ఫలహార/భోజన/ నివాస్ ఖర్చు

శిక్షణ వేదిక ఖర్చులు,  శిక్షణ సామాగ్రి మరియు శిక్షణ పనిముట్ల ఖర్చులు, మరియు

శిక్షకుని గౌరవ వేతనం మరియు వాని ప్రయాణ ఖర్చులు

మరింత సమాచారమునకు : https://agricoop.nic.in/Admin_Agricoop/Uploaded_File/STRY2122015.pdf


About pratibha mca

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *